రేవంత్‌రెడ్డి ఇంటి ముందు రాజనరసింహ వర్గీయుల ఆందోళన

విధాత : పటాన్ చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో తన అనుచరులకు కాంగ్రెస్ టికెట్లు దక్కకపోవడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నేత దామోదరం రాజనరసింహ పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన అనుచరులు మంగళవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని లోనికి దూసుకెళ్లకుండా నియంత్రించారు. ఒక దశలో రాజనరసింహ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా వినిపించింది.
అయితే పార్టీ ఇంచార్జీ మాణిక్‌రావు థాక్రే సహా ఏఐసీసీ నేతలు పలువురు రాజనరసింహకు ఫోన్ చేసి బుజ్జగించారు. పటాన్ చెరులో కాటా శ్రీనివాస్‌గౌడ్, నారాయణఖేడ్‌లో పటోళ్ల సంజీవరెడ్డికి బదులుగా నీలం మధు, సురేశ్‌కుమార్ షెట్కార్‌లకు టికెట్లు కేటాయించారు. దీంతో దామోదరం రాజనరసింహ తీవ్ర అసంతృప్తి వ్యక్త్తం చేస్తున్నారు. అటు కొత్తగూడెం టికెట్‌ను సీపీఐకి కేటాయించడం పట్ల టికెట్ ఆశించిన ఎడవెల్లి కృష్ణ వర్గీయులు ఆ నియోజకవర్గంలో నిరసనలకు దిగారు.