చెప్పిన హామీలన్ని అమలు చేస్తాం: మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుందని, ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కరలేని మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు

చెప్పిన హామీలన్ని అమలు చేస్తాం: మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్ రెడ్డి

మోసాలు చేసిన వారికే అనుమానాలు
ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం

విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుందని, ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కరలేని మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 70 రోజులకే ఎన్నికల కోడ్ వచ్చిందని, ఐనప్పటికి మేం చెప్పిన ఆరు గ్యారంటీలలో ఐదింటిని 70రోజుల్లోనే అమలు చేశామని తెలిపారు. ఇలా చేయడం ఈ దేశ చరిత్రలోనే మాదే మొదటి ప్రభుత్వమన్నారు. గతంలో ఉన్న పాలకులు మోసం అబద్ధాలతో వ్యవహారించినందునా వారికి అందరిపై అనుమానాలుంటాయని ఎద్దేవా చేశారు. మిగతా గ్యారంటీలు..హామీలన్నింటిని ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఒక్కోటిగా అమలు చేస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి 272 స్థానాల కన్న ఎక్కువ గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని, రాహుల్ గాంధీ జూన్ 9న ప్రధాన మంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తారని ఉత్తమ్ జోస్యం చెప్పారు. ధాన్యం కొనుగోలు సమస్యలపై స్పందిస్తూ రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని.. గతేడాది కంటే ఈ ఏడాది వారం ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. గత ఏడాది 7031 ఉంటే ఎప్పుడు 7149 ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 6919 కేంద్రాల్లో ధాన్యం కొనుగొలు జరుగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.

గతేడాది ఏప్రిల్ 1 నాటికి కేవలం 339 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెరిచారని.. గతేడాది ఏప్రిల్ 15 నాటికి సిద్ధిపేట జిల్లాలో ఒక్క దాన్యం కొనుగోలు కేంద్రం తెరవలేదన్నారు. ఈ ఏడాది అక్కడ ఇప్పటికే 418 కొనుగోలు కేంద్రాలు తెరిచామన్నారు. ధాన్యం ఎక్కువ ఉన్న చోట అదనపు కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మద్దతు ధర అమలులో కఠినంగా ఉన్నామని, కొన్ని చోట్ల మద్దతు ధర కంటే అధిక రేటు వస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వెంటనే రవాణా చేసే విధంగా ఆదేశాలు జారీ చేశామని, రైతులకు ధాన్యం డబ్బులు సకాలంలో బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ రైతాంగం ఒక్క గింజ ధాన్యం కూడా కనీస మద్దతు ధరకు తక్కువకు అమ్ముకోవద్దని కోరారు.
కిషన్ రెడ్డి ఏదో దీక్షా చేశారని, బీఆరెస్‌, బీజేపీ నేతలు ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై చేసిన విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ధాన్యం ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకు అమ్మారు అంటున్నారని, గతంలో 7వేల కోట్ల పెట్టు కొనుగోలు చేసి 2వేల నష్టానికి కొనుగోలు చేశారని, వ్యవసాయ ఉత్పత్తులలో లాభనష్టాలను చూడకుండా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. గత ప్రభుత్వం ధాన్యం నిల్వల విక్రయంలో క్వింటాల్‌కు17వందల 2 రూపాయలు వస్తే, తమ ప్రభుత్వం కమిటీ వేసి అదే ధాన్యం అమ్మివేస్తే.. క్వింటాల్ కి 2022/- వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో సన్న బియ్యం, దొడ్డు బియ్యానికి తేడా లేకుండా వేలంలో అమ్మివేశారని, ఈ సారి ధాన్యం వేలం వేయడం ద్వారా 1110.05 కోట్లు ఎక్కువ గా వచ్చాయన్నారు. పౌర సరఫరాల శాఖను గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా నడిపించిందని, ప్రతి జిల్లాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్‌ మాఫియా తయారైందన్నారు.