Allu Arjun । నాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు.. వ్య‌క్తిత్వ హ‌న‌నం స‌రికాదు.. హీరో అల్లు అర్జున్ అస‌హ‌నం

హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య సినిమా థియేట‌ర్ లో జ‌రిగిన తొక్కిస‌లాట దుర‌దృష్ట‌క‌రం, నేను చాలా బాధ‌ప‌డుతున్నాన‌ని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఇవాళ అల్లు అర్జున్ మీడియా తో మాట్లాడుతూ, నాపై చేస్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌లు బాధ క‌లిగిస్తున్నాయి. దుర్ఘ‌ట‌న త‌రువాత‌ నా వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రుస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Allu Arjun । నాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు.. వ్య‌క్తిత్వ హ‌న‌నం స‌రికాదు.. హీరో అల్లు అర్జున్ అస‌హ‌నం
Allu Arjun । హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య సినిమా థియేట‌ర్ లో జ‌రిగిన తొక్కిస‌లాట దుర‌దృష్ట‌క‌రం, నేను చాలా బాధ‌ప‌డుతున్నాన‌ని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఇవాళ అల్లు అర్జున్ మీడియా తో మాట్లాడుతూ, నాపై చేస్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌లు బాధ క‌లిగిస్తున్నాయి. దుర్ఘ‌ట‌న త‌రువాత‌ నా వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రుస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేను రోడ్డు షో చేయ‌లేదు, ఊరేగింపులు చేయ‌లేద‌న్నారు.
ఈ ఘ‌ట‌న‌లో రేవ‌తి చ‌నిపోయింద‌ని, ఆమె కుమారుడు శ్రీ తేజ్‌ హాస్పిట‌ల్ లో కోమాలో ఉన్నార‌ని మ‌రుస‌టి రోజు సినిమా టీమ్ స‌భ్యులు చెప్పార‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు త‌న‌కు థియేట‌ర్ లో తెలియ‌చేయ‌లేద‌ని, మా వాళ్లు చెబితేనే నేను అక్క‌డి నుంచి ఇంటికి వెళ్లిపోయాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. నేను హాస్పిట‌ల్ కు వెళ్లాల‌ని అనుకున్నాను కాని, నిర్మాత సూచ‌న మేర‌కు అక్క‌డ‌కు వెళ్ల‌లేద‌న్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఎప్ప‌టిక‌ప్పుడు హాస్పిట‌ల్ వాళ్ల‌తో మాట్లాడుతున్నార‌న్నారు. ఈ దుర్ఘ‌ట‌న‌పై ఒక వీడియో పెట్టాను, వేడుక‌ల‌ను కూడా ర‌ద్దు చేశామ‌న్నారు. తెలంగాణ శాస‌న స‌భ‌లో శ‌నివారం సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గ‌ట్టి హెచ్చ‌రిక‌ చేసిన నేప‌థ్యంలో అల్లు అర్జున్ మీడియా స‌మావేశానికి ప్రాముఖ్య‌త ఏర్ప‌డింది.