accreditation cards । జర్నలిస్టులు కొత్త అక్రెడిటేషన్ కార్డుల కోసం మరో మూడు నెలలు ఆగాల్సిందే…
తెలంగాణ జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలలు పొడిగించారు. 2025 జనవరిలోనే కొత్త కార్డులు జారీ చేయనున్నారు.

accreditation cards । తెలంగాణలోని జర్నలిస్టులు కొత్త అక్రెడిటేషన్ కార్డుల కోసం మరో మూడు నెలలు ఆగాల్సిందే. 2025 జనవరిలోనే కొత్త కార్డులు రానున్నాయి. ఈ మేరకు గురువారం సమాచార శాఖ కమిషనర్ ఎం. హన్మంతరావు పాత అక్రెడిటేషన్ కార్డుల గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు వాలిడిటీ అయ్యే విధంగా మరోసారి గడువును పెంచారు. వాస్తవంగా గత ప్రభుత్వం ఇచ్చిన అక్రెడిటేషన్ కార్డుల గడువు ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. దీంతో సెప్టెంబర్ 31వ తేదీ వరకు గడువు పెంచుతూ మొదటిసారి ఉత్తర్వులు జారీ చేశారు. మరో నాలుగు రోజుల్లో గడువు ముగియనుండడంతో ప్రభుత్వం రెండవసారి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ కార్డుల గడువును పెంచింది. వాస్తవంగా అక్రెడిటేషన్ కార్డుల జారీ చేయాలంటే జర్నలిస్ట్ లతో ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీ ఏర్పాటు పూర్తయిన తరువాతనే ప్రభుత్వం నూతన అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయనున్నది.