ఫోన్ ట్యాపింగ్ ఏఎస్పీలకు రిమాండ్
ఫోన్ ట్యాంపింగ్ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్సీలు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు రిమాండ్ విధించింది.

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాంపింగ్ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్సీలు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు రిమాండ్ విధించింది. మంగళవారం వారిద్దరి కస్టడీ ముగియడంతో పోలీసులు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వారికి ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే తిరుపతన్న, భుజంగరావు నుంచి కీలక అంశాలను రాబట్టారు.
ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తిరుపతన్న, భుజంగరావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటు రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో వేణుగోపాల్‌రావు పేరు చేర్చారు. దీంతో ఆయనను కూడా విచారించనున్నారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ఆదేశాల మేరకే పోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు, సీఐ గట్టుమల్లులు ఇప్పటికే స్పష్టం చేశారు.