అమ్మకానికి ల్యాంకో అన్పర పవర్‌

హైదరాబాద్‌,విధాత‌: ల్యాంకో అన్పర పవర్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఏపీఎల్‌)లో వాటా విక్రయించాలని బ్యాంకర్లు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదార్ల నుంచి బిడ్లను బ్యాంకర్ల తరఫున ఐడీబీఐ ట్రీస్టీషిప్‌ సర్వీసెస్‌ ఆహ్వానించింది. ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌కు ఐడీబీఐ బ్యాంకుతో పాటు కొన్ని ఇతర బ్యాంకులు రుణాలు జారీ చేశాయి. ఈ రుణాలకు తనఖా కింద ఎల్‌ఏపీఎల్‌లో 71.17 శాతం ఈక్విటీ వాటాతో పాటు 45.67 శాతం ప్రిఫరెన్స్‌ షేర్లను ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ బ్యాంకులకు తనఖా పెట్టింది. కానీ అప్పు తీర్చనందున ఆ […]

అమ్మకానికి ల్యాంకో అన్పర పవర్‌

హైదరాబాద్‌,విధాత‌: ల్యాంకో అన్పర పవర్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఏపీఎల్‌)లో వాటా విక్రయించాలని బ్యాంకర్లు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదార్ల నుంచి బిడ్లను బ్యాంకర్ల తరఫున ఐడీబీఐ ట్రీస్టీషిప్‌ సర్వీసెస్‌ ఆహ్వానించింది. ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌కు ఐడీబీఐ బ్యాంకుతో పాటు కొన్ని ఇతర బ్యాంకులు రుణాలు జారీ చేశాయి. ఈ రుణాలకు తనఖా కింద ఎల్‌ఏపీఎల్‌లో 71.17 శాతం ఈక్విటీ వాటాతో పాటు 45.67 శాతం ప్రిఫరెన్స్‌ షేర్లను ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ బ్యాంకులకు తనఖా పెట్టింది. కానీ అప్పు తీర్చనందున ఆ షేర్లను రుణదాతలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాటాలు విక్రయించాలని తాజాగా నిర్ణయించారు. ఈ ప్రక్రియకు డెలాయిటీ టచ్‌ తొమత్సు ఇండియాను క‌న్స‌ల్టెన్సీ సంస్థగా ఎంపిక చేశారు. ల్యాంకో అన్పర పవర్‌ లిమిటెడ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని అన్పరలో ఒక్కొక్కటీ 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు (మొత్తం సామర్థ్యం 1200 మెగావాట్లు) గల థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఉంది. ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌కు ఇది పూర్తి అనుబంధ సంస్థ.