గౌరవం లేని చోట ఎందుకున్నావ్.. రాజగోపాల్ రెడ్డిపై బూర ఫైర్
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు చూస్తుంటే జాలిగా ఉందని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. గౌరవం లేని చోట ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నర్సయ్య మీడియా సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు

విధాత : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు చూస్తుంటే జాలిగా ఉందని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. గౌరవం లేని చోట ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నర్సయ్య మీడియా సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేపదే అడుక్కోవడం బాగాలేదని, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సత్తా చాటాలని బూర నర్సయ్య.. రాజగోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు.
అయితే, ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర అధిష్ఠానంపై కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రేస్ లో చేరారని, కానీ ఇప్పుడు దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గం ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని చెప్పారు. ఈ క్రమంలో మనసు చంపుకుని బతకడం తన వల్ల కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శలు చేయడం ఆసక్తిగా మారింది.