KTR — Kavitha | చెల్లి అలా.. అన్న ఇలా.. నిప్పులు చెరిగిన కవిత.. ప్రశంసలు కురిపించిన కేటీఆర్‌

KTR — Kavitha | చెల్లి అలా.. అన్న ఇలా.. నిప్పులు చెరిగిన కవిత.. ప్రశంసలు కురిపించిన కేటీఆర్‌

KTR — Kavitha | కాళేశ్వరం కుంభకోణం వివాదంలో మాజీ మంత్రి టీ హరీశ్ రావుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపాయి. హరీశ్‌వల్లే కేసీఆర్‌ సీబీఐ విచారణను ఎదుర్కొనాల్సి వస్తున్నదని కవిత ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. మొన్నటిదాకా పేరు ప్రస్తావన లేకుండా విమర్శలు చేసిన కవిత.. నేరుగా హరీశ్‌తోపాటు.. సంతోష్‌నూ ఈడ్చారు. దీంతో బీఆరెస్‌ శ్రేణులు కంగుతిన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించిన కవిత.. అది హరీశ్‌ పాపమేనని తేల్చారు. అందుకే హరీశ్‌కు రెండో దఫా ఆ పదవి ఇవ్వలేదని బయటపెట్టారు. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని వ్యాఖ్యానించారు.

ఆ వెంటనే బీఆరెస్‌ సామాజిక మాధ్యమాలు అలర్ట్‌ అయ్యాయి. కవిత టార్గెట్‌గా, హరీశ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ పోస్టులు పొంగాయి. ఇలా చేసిన ఒక పోస్టును రీపోస్ట్ చేసిన కేటీఆర్‌.. హరీశ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘నిజంగా మన డైనమిక్ లీడర్ హరీశ్ నుంచి వచ్చిన మాస్టర్ క్లాస్’ అని కొనియాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్ మంచి శిష్యుడు హరీశ్ రావు నుంచి అయిష్టంగానైనా అద్భుతమైన పాఠం నేర్చుకున్నారని నేను అనుకుంటున్నానని పోస్టు చేశారు. దీంతో కొంత వ్యవధిలోనే అన్నా చెల్లెలు హరీశ్‌పై చెరొక విధంగా స్పందించడం రాజకీయంగా ఆసక్తి రేపింది.