హంతకులే సంతాప సభ జరపినట్లుంది కాకతీయ తోరణం తొలగిస్తే ఉద్యమిస్తాం బీఆరెఎస్ నేత ..దాస్యం వినయ్ భాస్కర్
నిన్న పరేడ్ గ్రౌండ్‌లో, నేడు జిల్లాలో ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని వారు ఉద్యమకారులను సన్మానిస్తున్న చర్యలను చూస్తే హంతకులే సంతాప సభ జరపినట్లు ఉందని మాజీ చీఫ్ విప్, బీఆరెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్న పరేడ్ గ్రౌండ్‌లో, నేడు జిల్లాలో ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని వారు ఉద్యమకారులను సన్మానిస్తున్న చర్యలను చూస్తే హంతకులే సంతాప సభ జరపినట్లు ఉందని మాజీ చీఫ్ విప్, బీఆరెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యమకారులపైకి తుపాకి ఎత్తిన వారు ఉద్యమ నేలను పాలిస్తుండడం నిజంగా శోచనీయమన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం
పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం తెలంగాణ అవతరణ దశాద్ధి ఉత్సవాలను నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను శాసనమండలి డిప్యూటి చైర్మన్ బండ ప్రకాశ్ ఎగరవేశారు. తదుపరి ఉద్యమకారులను సన్మానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్ , పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడారు తెలంగాణను వ్యతిరేకించిన వారే నేడు తెలంగాణ కోసం కొట్లాడిన బీఆరెస్ ను విమర్శిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యమకారులను కంటికి రెప్పలా కాపాడుకుంది బీఆర్ఎస్,
ఉద్యమకారులను జైళ్లలో పెట్టి, కేసుల పాలు చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు. ఓరుగల్లు స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అగ్రభాగన నిలిచిందనీ, మళ్ళీ ప్రభుత్వంపై పోరాడడానికి సిద్ధమవుతోందన్నారు. ఓరుగల్లు ఉనికిని, తెలంగాణ అస్తిత్వాన్ని ఓర్చుకోలేని వారు నేడు అధికారంలో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్‌ను రాష్ట్ర చిహ్నంలో పొందుపర్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కారు కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్‌ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ సర్కారు ఆ చర్యకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలో పెద్దెత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
మంత్రులు సురేఖ, సీతక్క స్పందించాలి
ఉద్యమాలు, పోరాటాలు, కేసులు కొత్త కావన్నారు. జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖ కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్‌ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించకుండా, ఇక్కడి ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తెలపాలని సూచించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.