మెదక్ ఉమ్మడి జిల్లాలో రోడ్డెక్కిన BRS నాయకులు కార్యకర్తలు

కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా మహాధర్నా మెదక్ రాందాస్ చౌరస్తాలో.. పద్మా దేవేందర్ రెడ్డి  సిద్దిపేటలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ పాల్గొన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం మెదక్ ఉమ్మడి జిల్లాలో BRS పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లాల పార్టీ అధ్యక్షుల అధ్వర్యంలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాలలో మహాధర్నా నిర్వహించారు. మెదక్‌లో రాందాస్ […]

మెదక్ ఉమ్మడి జిల్లాలో రోడ్డెక్కిన BRS నాయకులు కార్యకర్తలు
  • కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా మహాధర్నా
  • మెదక్ రాందాస్ చౌరస్తాలో.. పద్మా దేవేందర్ రెడ్డి
  • సిద్దిపేటలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
  • సంగారెడ్డిలో చింతా ప్రభాకర్
  • పాల్గొన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం
మెదక్ ఉమ్మడి జిల్లాలో BRS పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లాల పార్టీ అధ్యక్షుల అధ్వర్యంలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాలలో మహాధర్నా నిర్వహించారు. మెదక్‌లో రాందాస్ చౌరస్తాలో జరిగిన మహాధర్నాలో జిల్లా బీ అర్ యస్, పార్టీ అధ్యక్షురాలు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మోడీ తెలంగాణ వ్యతిరేకి అన్నారు.

ఉపాధి హామీ పథకం కింద రైతులకోసం కల్లాలు నిర్మిస్తే నిధులు తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అడుగుతోందనీ అన్నారు. తెలంగాణపై కేంద్రం విషం చిమ్ముతుందన్నారు.ఎమ్మెల్యే మధన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలోని రైతు రాజ్య స్థాపన కోసం బిఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సోములు,ఎంపీపీలు, జడ్పీటీసీలు,మెదక్,రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి,సారాఫ్ యాదగిరి,మున్సిపల్ చైర్మన్ లు, చంద్రపాల్,జితేందర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు..

సిద్దిపేటలో..

సిద్దిపేటలో BRS పార్టీ అధ్యక్షుడు ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్వర్యంలో ధర్నా జరిగింది. ఎమ్మెల్సీ ఫారూ క్ హుస్సేన్, యాదవరెడ్డి,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద మంజురైన నిదులు కేంద్రప్రభుత్వం తిరిగి ఇవ్వమంటుందని మండి పడ్డారు. దేశంలో రైతు ప్రభుత్వం తీసుకురావడం కోసం సీఎం కేసీఆర్ BRS పార్టీనీ స్థాపించారని అన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్,సరఫరాతో పాటు,రైతు బంధు,రైతు బీమా తదితర పథకాలతో అభివృద్ధి పథంలో ఉందన్నారు.

సంగారెడ్డిలో

మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావ్, భూపాల్ రెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, పార్టీ అధ్యక్షుడు చింత ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ పై ప్రధాని మోడీ కక్ష కట్టారని మండి పడ్డారు.