25 మందితో బీఎస్పీ మూడో జాబితా వెల్లడి

25 మందితో బీఎస్పీ మూడో జాబితా వెల్లడి
  • పెండింగ్‌లో 35 స్థానాలు


విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బీఎస్పీ శనివారం విడుదల చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 25 మందితో కూడిన మూడో జాబితా ప్రకటించారు. ఇందులో ఇదివరకే ప్రకటించిన రాజేంద్రనగర్ అభ్యర్ధి అన్వర్ ఖాన్ కు అంబర్ పేట్‌ టికెట్ కేటాయించారు. రాజేంద్రనగర్ టికెట్ ను రాచమల్ల జయసింహకు ఇచ్చారు. మొదటి జాబితాలో 20 మందిని, రెండో జాబితాలో 39 మందిని విడుదల చేసిన, బీఎస్పీ మూడో జాబితాలో మరో 25 మందిని ప్రకటించింది. మొత్తం 84 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, 35స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.


మూడో జాబితాలో మహేశ్వరం నియోజకవర్గం అభ్యర్థిగా కొత్త మనోహర్ రెడ్డిని, చెన్నూరు(ఎస్సీ) అభ్యర్థిగా డాక్టర్ దాసరపు శ్రీనివాస్, ఆదిలాబాద్ అభ్యర్థిగా ఊయక ఇందిరా, ఆర్మూర్ అభ్యర్థిగా గండికోట రాజన్న, నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా మాటమాల శేఖర్, బాల్కొండ అభ్యర్థిగా పల్లికొండ నరసయ్య, కరీంనగర్ అభ్యర్థిగా నల్లాల శ్రీనివాస్, హుస్నాబాద్ కు పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్, నర్సాపూర్ కుతాడి నరసింహులు, సంగారెడ్డికి పల్పనూరి శేఖర్, మేడ్చల్ మల్లెపువ్వు విజయరాజు, కుత్బుల్లాపూర్ మహమ్మద్ లమ్రా ఆహ్మద్‌.


ఎల్బీనగర్ గువ్వా సాయి రామకృష్ణ ముదిరాజ్, రాజేంద్రనగర్ రాచమల్లు జయసింహ, అంబర్ పేట్‌ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, కార్వాన్ ఆలెపు అంజయ్య, గోషామహల్ మహ్మద్ కైరుద్దీన్, నారాయణపేట బొడిగెల శ్రీనివాస్, జడ్చర్ల శివ ఉల్కుందకర్, అలంపూర్(ఎస్సీ) మాకుల చెన్నకేశవరావు, పరకాల ఆముదాల పెళ్లి నరేష్ గౌడ్, భూపాలపల్లి గజ్జి జితేందర్ యాదవ్, ఖమ్మం అయితగాని శ్రీనివాస్ గౌడ్, సత్తుపల్లి(ఎస్సీ) నీలం వెంకటేశ్వరరావు నారాయణఖే్‌డ్‌కు మహ్మద్ అలావుద్దిన్‌ పటేల్ లను ప్రకటించారు.