ప్రభుత్వ సాయం మాకొద్దు.. రూ.20లక్షల చెక్కు వెనక్కిచ్చేస్తాం

విధాత‌: తమకు ప్రభుత్వం తరఫున అందజేసిన సాయాన్ని వెనక్కిచ్చేస్తామని సైదాబాద్‌ బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని ఈ ఉదయం పరామర్శించిన మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ వారికి రూ.20 లక్షల చెక్కు అందజేశారు. కాగా, మంత్రులు చేసిన సాయాన్ని బాలిక కుటుంబ సభ్యులు తిరస్కరించారు. రూ.20 లక్షల చెక్కు తమకు అవసరం లేదని లేల్చి చెప్పారు. మంత్రులు ఇచ్చిన చెక్కును వెనక్కి ఇచ్చేస్తాం అని కుటుంబ సభ్యులు తెలిపారు.