వెయ్యి కోట్లు ఖర్చుపెట్టైనా సరే కొండగట్టు అంజన్న ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా: సీఎం కేసీఆర్

వెయ్యి కోట్ల రూపాయల ఖర్చయినా సరే కొండగట్టు అంజన్న ఆలయాన్ని బ్రహ్మాండమైన ఆలయంగా తీర్చిదిద్దుతామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు

వెయ్యి కోట్లు ఖర్చుపెట్టైనా సరే కొండగట్టు అంజన్న ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా: సీఎం కేసీఆర్

విధాత‌: వెయ్యి కోట్ల రూపాయల ఖర్చయినా సరే కొండగట్టు అంజన్న ఆలయాన్ని బ్రహ్మాండమైన ఆలయంగా తీర్చిదిద్దుతామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ‘బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ. కాంగ్రెస్‌ హయాంలో సాగు నీటికి కటకట ఉండె. రైతులు బోర్లు వేసి నీళ్లు పడక ఆత్మహత్యలు చేసుకునేటోళ్లు. ఇదే నియోజకవర్గంలో రామంచంద్రాపూర్‌ సర్పంచ్‌ తిరుపతి బోర్లు వేసివేసి నీళ్లు పడక చివరికి ఆ బోర్ల కాడనే ప్రాణం ఇడిసిండు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా పంటలు పండుతున్నయ్‌’ .


‘మీరు గతం గురించి ఒకసారి ఆలోచన చేయాలె. అప్పుడు గూడా వరద కాలువ ఉండె, ఇట్లనే కాకతీయ కాలువ ఉండె. అయినా చొప్పదండిలో సాగునీళ్లుకు కరువుండె. వరద కాలువతోని ఎన్ని బాధలు ఉండె..? మనం మోటర్‌ పెట్టుకుని నీళ్లు పారిచ్చుకుందాం అంటే దాన్ని కోసి అదే కాలువల ఎత్తేద్దురు. ఇయ్యాల మీ జోలికి ఎవడన్నా వత్తుండా..? ఇప్పుడు ఎన్ని తూములు పెట్టుకున్నం..? వరద కాలువను ఎంత బ్రహ్మాండంగా నదిలాగ చేసుకుని చొప్పదండిలో 1.25 లక్షల ఎకరాలకుపైగా పంటలు పండించుకుంటున్నం..? అంతేగాక మిషన్‌ కాకతీయ కింద కూడా అనేక చెరువులను, కుంటలను బాగు చేసుకుని పంటలు సాగుచేసుకుంటున్నం.’ .


‘ఈ నియోజకవర్గం కొండగట్టు అంజన్న కొలువైన నియోజకవర్గం. ఈ మధ్యనే మీ ఎమ్మెల్యే రవిశంకర్‌, వినోద్‌కుమార్‌ ఇంకా చాలా మంది కొండగట్టు అంజన్న ఆలయాన్ని ఒక అద్భుతంగా, దివ్యదామంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ మధ్యే నేను ఆ ఆలయాన్ని సందర్శించాను. వెయ్యి కోట్ల రూపాయల ఖర్చయినా సరే కొండగట్టు అంజన్న ఆలయాన్ని బ్రహ్మాండమైన ఆలయంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆ కొండగట్టు అంజన్న దీవెన మనందరి మీద ఉండాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ .


ఇవాళ‌ కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించిందట. ధరణిని తీసేసి భూ భారతి అని పేరు పెడుతరట. ఈ భూ భారతిని గతంలోనే 30, 40 ఏండ్ల కింద తెచ్చిండ్రు. దాంతోటి ఏంగాలె. మళ్ల పాత కథనే ఉండె. గదే పైరవీకారులు, అదే దళారీలు, అదే కథ ఉండె.


బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంటు ఇస్తున్నది. కాంగ్రెస్‌ పార్టీ మూడు గంటలు చాలు అంటున్నది. మరి 24 గంటలోడు కావాల్నో.. మూడు గంటలోడు కావాల్నో మీరే తేల్చాలి. మేం రైతుబంధు ఇస్తున్నం. కాంగ్రెసోళ్లు రైతుబంధు వేస్ట్‌ అంటున్నరు. మరి రైతుబంధు ఇచ్చెటోళ్లు కావాల్నో.. రైతుబంధు వేస్ట్‌ అనేటోళ్లు కావాల్నో మీరే నిర్ణయించుకోవాలె. మేం భూముల్లో అక్రమాలు లేకుండా ధరణి తెచ్చినం. వాళ్లు రైతుబంధును బంగాళాఖాతం వేస్తమంటున్నరు. మరి ధరణి పోర్టల్‌ను ఉంచుకుంటరో.. బంగాళాఖాతంలో వేసుకుంటరో మీ ఇష్టం. రైతులకు మేలు చేసేటోడు కావాల్నో.. కిందమీద జేసేటోడు కావాల్నో తేల్చుకోండి. మీరు ఆలోచించకుండా ఓటేస్తే ఆగమైతరు. అప్పుడు నేను గూడా ఏం చేయలేను. పదేళ్లుగా మేం పడ్డ కష్టం బూడిదల పోసిన పన్నీరు అయితది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి, ఎవరిని గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతదో చూసి ఓటేయండి.


గోపాల్‌రావు పేట, ఘర్షకుర్తి మండలాలు కావాలని మీ ఎమ్మెల్యే రవిశంకర్‌ కోరిండు. అదేం పెద్దపని కాదు. నిమిషాల మీద జీవో ఇష్యూ చేసి ఆ రెండు మండలాలు ఏర్పాటు చేస్తమని మనవి చేస్తున్నాం. మీరు ముందుగా రవిశంకర్‌ను గెలిపియ్యండి. మండలాల ఏర్పాటుతోపాటు రవిశంకర్‌ కోరిన ఇంకా కొన్ని పనుల సంగతి నేను చూసుకుంట.