కేసీఆర్ పులి అయితే బోనులో వేస్తాం..చెట్టుకు వేలాడదీసి బాదుతాం

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి అధికారం కోల్పోయినా బీఆరెస్ పార్టీ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ పార్టీని వంద మీటర్ల గొయ్యి

కేసీఆర్ పులి అయితే బోనులో వేస్తాం..చెట్టుకు వేలాడదీసి బాదుతాం
  • ఓడినా బీఆరెస్ నాయకులకు అహంకారం తగ్గలేదు
  • బీఆరెస్‌ను 100మీటర్ల గొయ్యి తీసి పాతిపెడుతాం
  • లోక్‌సభ ఎన్నికల తర్వాతా బీఆరెస్ కనుమరుగే
  • లండన్ టూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్‌

విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి అధికారం కోల్పోయినా బీఆరెస్ పార్టీ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ పార్టీని వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెడుతానని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మూడు రోజుల్లో విదేశీ పర్యటన ముగించుకుని తెలంగాణకు వస్తున్నానని, బీఆరెస్ అంతు చూస్తానన్నారు. లండన్ పర్యటనలో ప్రవాస భారతీయులు..కాంగ్రెస్ అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆరెస్ నాయకులపై షాకింగ్ కామెంట్లతో విరుచుకపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని అన్నారు. లోకసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో చూద్దామన్నా బీఆరెస్‌ కనిపించదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆరెస్‌ కారు గుర్తే ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆరెస్ నేతల అహంకారం తగ్గించే బాధ్యత నాదేనన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాతా భయంలో బీఆరెస్ నేతలు ఆగమాగమై మాట్లాడుతున్నారన్నారు.

సీఎం కేసీఆర్ పులి లాంటి వాడని ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి పులి ఇంట్లో పడుకుందట..లేచి రాబోతున్నదట..మేం కూడా దాని కోసమే ఎదరుచూస్తున్నామని, మా దగ్గర బోను వల ఉన్నాయని, ఆ పులి వస్తే చెట్టుకు వేలాడదీసి బాదుతామని కేసీఆర్‌ను ఉద్ధేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఎన్నికకే బొక్క బోర్లా పడ్డారని వ్యంగ్యాస్త్రాలు వేశారు.రాష్ట్ర అభివృద్ధి ఆలచనతో అందరిని సమన్వయం చేసుకుని ముందుకెలుతుంటే కేటీఆర్‌, హరీశ్‌రావులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. మీలా నేను తండ్రి పేరుతో మంత్రి అయి విలాస వంతమైన జీవితం గడించేందుకు విదేశాలకు రాలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల సాధనకు తీరిక లేకుండా సమావేశాలు జరుపుతున్నామన్నారు. ఎన్నికలప్పుడే తాను రాజకీయాలు చేస్తానని, మిగతా సమయంలో రాష్టాభివృద్ధికి ఆలోచనతో ఉంటానన్నారు. ఈ నెల 25వ తర్వాతా ఇంద్రవెల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నట్లుగా వెల్లడించారు. 

కాగా సీఎం రేవంత్ రెడ్డి లండన్‌లో కేసీఆర్‌పైన, బీఆరెస్ నేతలపైన చేసిన ఘాటు విమర్శల నేపధ్యంలో ఇక మీదట తెలంగాణలో బీఆరెస్ నుంచి లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా భారీగా ఫిరాయింపులుంటాని అంచనా వేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ఎన్నికల హామీల పేరుతో బీఆరెస్ చేసే కార్యక్రమాలను అణిచివేసే దిశగా చర్యలుంటాయని భావిస్తున్నారు.