CM Revanth Reddy | దేశ ప్రగతిలో రాజీవ్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్రెడ్డి
దేశ ప్రగతిలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని.. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు

విధాత, హైదరాబాద్ : దేశ ప్రగతిలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని.. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సోమాజిగూడలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి. హనుమంతరావు, షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.