కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి మే డే శుభాకాంక్షలు
: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్మికలోకానికి ’మే’ డే శుభాకాంక్షలు తెలిపారు

విధాత: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్మికలోకానికి ’మే’ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి తెలంగాణ పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ సీఎం రేవంత్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.