CM Revanth Reddy | పట్టభద్రుల ఎమ్మెల్సీని భారీ మెజార్టీతో గెలవాలి

ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ గెలవాలని, ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలింగ్ ముగిసేదాక సీరియస్‌గా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ఇంచార్జిలను కోరారు.

CM Revanth Reddy | పట్టభద్రుల ఎమ్మెల్సీని భారీ మెజార్టీతో గెలవాలి

ఇంచార్జిలతో సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్‌

విధాత, హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ గెలవాలని, ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలింగ్ ముగిసేదాక సీరియస్‌గా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ఇంచార్జిలను కోరారు. అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జ్ లతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం జూమ్ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్చార్జ్ లు ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేయాలని, ఈనెల 27న పోలింగ్ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నాయకులను సన్నద్ధం చేయాలన్నారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో నిర్లక్ష్యం పనికిరాదన్నారు. ప్రతీ ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ లను సందర్శించాలని సూచించారు.

నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని, సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్న గెలుపు ఉపయోగపడుతుందన్నారు. ఇది తీన్మార్ మల్లన్న ఎన్నిక మాత్రమే కాదని.. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గట్టిగా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా 30వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిందని, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టిందని, ఓక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందుకెలుతుందని గుర్తు చేశారు.