నాకు ఆహ్వానం లేదు..సీఎం పిలిస్తే ఎందుకు వెళ్లను?: సీఎండి ప్రభాకర్ రావు

విద్యుత్‌ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షకు హాజరుకాకపోవడంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు

నాకు ఆహ్వానం లేదు..సీఎం పిలిస్తే ఎందుకు వెళ్లను?: సీఎండి ప్రభాకర్ రావు

విధాత : విద్యుత్‌ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షకు హాజరుకాకపోవడంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు. సీఎం సమీక్ష గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, తనను సమీక్షకు ఎవరూ పిలువలేదని చెప్పారు. ముఖ్యమంత్రి సమీక్షకు పిలిస్తే తాను ఎందుకు వెళ్లనని ఆయన ప్రశ్నించారు. దాంతో ప్రభాకర్‌రావును సమీక్షకు పిలువాలని సీఎం ఆదేశించినా విద్యుత్‌ శాఖ కార్యదర్శి ఎందుకు పిలువలేదనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


అంతకు ముందు రోజు సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శితో నిర్వహించిన భేటీలో విద్యుత్తు శాఖ సంక్షోభం..అప్పులపై చర్చ సందర్భంగా ఆగ్రహానికి గురయ్యారు. నిన్నటిదాకా అంతా బాగుందని చెప్పి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షోభం..అప్పులని మాట్లాడుతున్నారంటూ రేవంత్ అగ్రహాం వ్యక్తం చేశారు. సీఎండి ప్రభాకర్‌రావు రాజీనామాను ఆమోదించవద్దని, సమీక్షకు ఆయన హాజరయ్యేలా చూడాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు సమీక్షకు రాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.