CONGRESS | యాదగిరిగుట్టలో హరీశ్‌రావు పూజలపై ఫిర్యాదు

బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మాడవీధుల్లో గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా చేపట్టిన పాప ప్రక్షాళన పూజలపై దేవాదాయ శాఖ చర్యలకు సిద్ధమైంది

CONGRESS | యాదగిరిగుట్టలో హరీశ్‌రావు పూజలపై ఫిర్యాదు

మాడ వీధులను శుభ్రం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మాడవీధుల్లో గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా చేపట్టిన పాప ప్రక్షాళన పూజలపై దేవాదాయ శాఖ చర్యలకు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ఆలయ ఈవో భాస్కర్‌రావు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. మాడవీధుల్లో పాప ప్రక్షాళన పూజలు చేయడం ఎండోమెంట్ సెక్షన్ 7 ప్రకారం దేవదాయశాఖ నేరంగా పరిగణిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు హరీశ్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆలయ ఈవో భాస్కర్ రావు సిద్ధమయ్యారు. రుణమాఫీపై దేవుళ్లపై ఒట్టు పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పినందుకు హరీశ్ రావు బీఆరెస్‌ పార్టీ నేతలకో కలిసి గుట్టపై పాపప్రక్షాళన కార్యక్రమం నిర్వహించారు. అయితే హరీశ్ రావు పూజలతో ఆలయ మాడ వీధులు అపరిశుభ్రమయ్యాయంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మాఢ వీధులను శుభ్రం చేశారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పార్టీ కార్యకర్తలతో మాఢ వీధులను స్వయంగా శుభ్రం చేశారు.