చెన్నూరు సీటు మీకెందుకు ?సీపీఐ నారాయణను నిల‌దీసిన కార్య‌క‌ర్త

వామపక్షాలతో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ కేటాయించనున్న సీట్లకు సంబంధించి కాంగ్రెస్‌ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి

చెన్నూరు సీటు మీకెందుకు ?సీపీఐ నారాయణను నిల‌దీసిన కార్య‌క‌ర్త

విధాత : వామపక్షాలతో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ కేటాయించనున్న సీట్లకు సంబంధించి కాంగ్రెస్‌ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పొత్తులో భాగంగా సీపీఐ, సీపీఎంలకు ఏయే సీట్లు కేటాయిస్తారన్నదానిపై ఏ గంటలోనైనా కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి ప్రకటన వెలువడనుంది. ఇది ఇలా ఉండగా సీపీఐ చెన్నూరు సీటును తీసుకునేందుకు అంగీకరించిందని భావనతో అక్కడి కాంగ్రెస్‌ కార్యకర్త ఒకరు ఏకంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకే ఫోన్‌ చేసి మీకు చెన్నూరు సీటు ఎందుకంటూ నిలదీశారు.


చెన్నూర్‌లో సీపీఐ పోటీ చేయడమంటే బీఆరెస్‌ అభ్యర్ధి బాల్క సుమన్‌ను గెలిపించడమేనంటూ కాంగ్రెస్‌ కార్యకర్త తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మీకు బలం లేని చోట ఎందుకు పోటీ చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా నారాయణకు, కాంగ్రెస్‌ కార్యకర్తకు మధ్య జరిగిన సంభాషణ ఆడియో వైరల్‌గా మారింది. మరోవైపు వామపక్షాలతో పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లు ఖరారైనట్లుగా తెలుస్తున్నది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.