జనంలో క్రేజీగా కాళేశ్వరం ఏటీఎం.. లక్ష కోట్ల నోటు డ్రా చేస్తున్న జనం

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీగా కొత్త పుంతలు తొక్కుతూ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం పేరుతో చేపట్టిన వినూత్న ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ కుటుంబం తన అవినీతి ఆర్జనకు ఏటీఎంగా వాడుకున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఫోటోతో కూడిన కాళేశ్వరం ఏటీఎంను హైద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది.