అంబర్ పేట సీటు జోలికొస్తే ఉత్తమ్ వెంట పడుతా: వీహెచ్

- ఉత్తమ్‌పై విహెచ్ తీవ్ర విమర్శలు
విధాత : కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు పంపేందుకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేను అడుతున్న అంబర్ పేట సీటును నాకు రాకుండా చేస్తున్నారని, అదే జరిగితే ఉత్తమ్ వెంట పడుతానని, ఇన్నాళ్లుగా ఉత్తమ్ ఏం చేశాలో అంతా బయడపెడుతానన్నారు. నేను ఎప్పుడు ఉత్తమ్‌కు వ్యతిరేకం చేయలేదని, పార్టీలో రెడ్లతో కలిసి సాగుతునే బీసీల కోసం కొట్లాడుతూ వచ్చానన్నారు. బీసీలంటే ఓట్లు వేసే యంత్రాలు కాదన్నారు.
ఇప్పటిదాకా పార్టీ బీసీ డిక్లరేషన్ చేయ్యలేదన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీసీలకు రెండు సీట్లు ఇస్తామని చెప్పి రేవంత్, వెంకట్‌రెడ్డిలు చెప్పారన్నారు. రెండో జాబితాలో బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో చూడాలన్నారు. ఉత్తమ్ బ్లాక్ మెయిల్ చేసి పదవులు తెచ్చుకున్నాడని, స్క్రీనింగ్ కమిటీ లో ఉండి మాపై దుష్పచారం చేస్తున్నాడని, ఉత్తమ్ పార్టీ వ్యతిరేకంగా చేసిన పనులను బయట పెడుతానన్నారు. నీకు, నీ భార్యకు సీట్లు కావాలగాని, మా సీట్లు మాకు వద్దా అంటూ ప్రశ్నించారు.
అంబర్‌పేట్ నియోజకవర్గం నుంచి గతంలో గెలిచి మంత్రిని అయ్యానని, అంబర్‌పేట్ అభివృద్ధి కోసం చాలా పనులు చేశానని, ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను లక్ష్మణ్ యాదవ్ అడుగుతున్నారని, గతంలో ఇక్కడి నుంచి యాదవ్ లు గెలిచారన్నారు. గత ఎన్నికల్లో కోదండరాం గట్టిగా పట్టు పట్టడం, అధిష్ఠానం కూడా చెప్పడంతో వెనక్కి తగ్గానన్నారు. గత ఎన్నికల్లో డబ్బులు తీసుకొని నేను వెనక్కి తగ్గానని చెప్పడం నిజం కాదని, హనుమంతరావు డబ్బులు తీసుకునే వ్యక్తి కాదని, అలా డబ్బులకు అమ్ముడుపొతే సగం హైదరాబాద్ నాదే ఉండేదన్నారు.
ఇప్పుడు ఉత్తమ్ నా అంబర్ పేట్ సీటు వెంట పడ్డాడని, ఇక్కడ నూతి శ్రీకాంత్‌గౌడ్‌ను ఉత్తమ్ ఎగదోస్తున్నారని, శ్రీకాంత్ నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసు పెట్టాడన్నారు. శ్రీకాంత్ లాంటి వ్యక్తిని ఉత్తమ్ ఎంకరేజ్ చేయడం సరైంది కాదన్నారు. సూర్యాపేటలో బీసీ మీటింగ్ పెడుతా అంటే పెట్టనీయలేదని, ఉత్తమ్‌కు బీసీ ఓట్లు కావాలగాని, బీసీ మీటింగ్ వద్దా అని ప్రశ్నించారు. నేను పార్టీ మారననని, గాంధీ కుటుంబానికి వీరాభిమానినన్నారు. ఉత్తమ్ తన మనుషులు మహేశ్వర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డిని పార్టీ నుంచి పంపించాడని, జగ్గారెడ్డిని కూడా పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేశాడని విహెచ్ ఆరోపించారు. జగ్గారెడ్డితో పీసీసీ అధ్యక్షుడవుతావని చెప్పి రేవంత్‌రెడ్డిపై ప్రతిరోజు మీడియాలో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డినే అని విహెచ్ ఆరోపించారు.