అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆరెస్‌ పార్టీల ప్రత్యేక బస్సులు రెండు వేర్వేరు మార్గాల్లో దూసుకుపోయాయి.

  • బస్సుల్లో బయలుదేరిన కాంగ్రెస్‌, బీఆరెస్‌ ఎమ్మెల్యేలు

విధాత, హైదరాబాద్‌ : అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆరెస్‌ పార్టీల ప్రత్యేక బస్సులు రెండు వేర్వేరు మార్గాల్లో దూసుకుపోయాయి. కాంగ్రెస్‌ పార్టీ బస్సులు మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరాయి. మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు..అవకతవకలను సీఎం రేవంత్‌ రెడ్డి బృందం పరిశీలించనుంది. మేడిగడ్డ టూర్‌కు బీఆరెస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వగా, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు వెళ్లారు.

ఇటు బీఆరెస్‌ ప్రత్యేక బస్సులు తెలంగాణ భవన్‌ నుంచి నల్లగొండలో ఈ రోజు మంగళవారం తలపెట్టిన చలో నల్లగొండ కేసీఆర్‌ బహిరంగ సభకు బయలుదేరాయి. బస్సుల్లో హరీశ్‌రావు, కేటీఆర్‌ సహా బీఆరెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆరెస్‌ నల్లగొండ బహిరంగ సభను నిర్వహిస్తుంది. పోటాపోటీగా ఒకే రోజు కాంగ్రెస్‌, బీఆరెస్‌ పార్టీలు నది జలాలు..ప్రాజెక్టుల అంశాలపై తలపెట్టిన కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

Somu

Somu

Next Story