కానిస్టేబుల్ ఎంపిక ఫలితాల విడుదల

విధాత : తెలంగాణ పోలీస్ నియామక బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం వెల్లడించారు. పలు విభాగాల్లో 16,604పోస్టులకుగాను 15,570మంది ఎంపికైనట్లుగా బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఎంపికైన అభ్యర్థులలో 12,886మంది పురుషులు, 2,884మంది మహిళలు ఉన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆక్టోబర్ 5వ తేదీకల్లా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లుగా తెలిపింది. కోర్టు కేసుల దృష్ట్యా పలు పోస్టులకు ఫలితాలు విడుదల చేయలేదని తెలిపింది.
పీటీవోలోని 100 డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వాహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టుల ఫలితాలు కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదని పేర్కోంది. అభ్యర్థుల వెరిఫికేషన్ అనంతరం వాటి తుది ఫలితాలు వెల్లడిస్తామంది.