కాళేశ్వరం కూలుతుంది..కల్వకుంట్ల కుటీరం నిండుతుంది: సీపీఐ నారాయణ

కాళేశ్వరం కూలుతుంది..కల్వకుంట్ల కుటీరం నిండుతుంది: సీపీఐ నారాయణ

విధాత : సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ట్వీట్టర్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు. కాళేశ్వరం కూలుతుంది..కల్వకుంట్ల కుటీరం నిండుతుందని ఆయన తన ట్వీట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ విమర్శించారు.


ఇందుకు మేడిగడ్డ బ్యారేజీ ఫోటో…కేసీఆర్‌ తన ఫామ్‌హౌజ్‌లో పండిన పంటను చూపుతున్న ఫోటోను నారాయణ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం లోపాలతో జరిగిందని కేంద్ర డ్యాం సెఫ్టీ ఆథార్టీ కమిటీ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టేదిగా ఉండగా, ప్రతిపక్షాలు నివేదిక అంశాల ఆధారంగా ప్రభుత్వ అవినీతిపై విమర్శల దాడి సాగిస్తున్నాయి.