వ్యాక్సినేషన్‌ను ప‌రిశీలించిన‌ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

విధాత‌(హైదరాబాద్‌): న‌గ‌రంలోని గోల్కొండ ప్రాంతీయ దవాఖానను శ‌నివారం రాష్ట్ర‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పరిశీలించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించి టీకాలు వేసుకున్న వారితో మాట్లాడారు. ఈనెల 10 నుంచి 12 తేదీల్లో రెండో డోస్‌ కొవిడ్‌ తీసుకునే వారికి వెసులుబాటు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో రెండో డోస్‌ తీసుకోవచ్చని తెలిపారు. త్వరలో దవాఖానలో వంద పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పిస్తామని అన్నారు. సీఎం ఆదేశాలతో మరో 120 పడకలు […]

వ్యాక్సినేషన్‌ను ప‌రిశీలించిన‌ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

విధాత‌(హైదరాబాద్‌): న‌గ‌రంలోని గోల్కొండ ప్రాంతీయ దవాఖానను శ‌నివారం రాష్ట్ర‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పరిశీలించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించి టీకాలు వేసుకున్న వారితో మాట్లాడారు. ఈనెల 10 నుంచి 12 తేదీల్లో రెండో డోస్‌ కొవిడ్‌ తీసుకునే వారికి వెసులుబాటు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో రెండో డోస్‌ తీసుకోవచ్చని తెలిపారు.

త్వరలో దవాఖానలో వంద పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పిస్తామని అన్నారు. సీఎం ఆదేశాలతో మరో 120 పడకలు సిద్ధం చేస్తున్నట్లు సీఎస్‌ అధికారులు చెప్పారు. మూడు వారాల్లో పడకలు అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోగులకు అందుతున్న సేవల పట్ల సీఎస్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. దవాఖాన సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంఓ, వైద్యులను ఆయన అభినందించారు.