అభివృద్ధి దిశగా పాడి ప‌రిశ్ర‌మ‌: చీఫ్ విప్ వినయ్ భాస్కర్

పాల ఉత్పత్తులకు మార్కెటింగ్ బాధ్య‌త‌ కార్యాల‌యం కోసం రూ.5లక్షల నిధుల కేటాయింపు విధాత, వరంగల్: రాష్ట్రంలో వ్యవసాయం, పాడి పరిశ్రమను అద్భుతంగా తీర్చిదిద్దామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ విజయ డెయిరీలో శుక్రవారం జరిగిన పాడి రైతుల అవగాహన సదస్సు ఉద్దేశించి ఆయ‌న‌ ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడ‌క‌ ముందు నిర్వహించే డెయిరీలు నష్టాల్లో నడిచాయని… రాష్ట్రం ఏర్పడ్డాక పాడి పరిశ్రమ అభివృద్ధి జరిగిందని అన్నారు. పల్లెల్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు […]

అభివృద్ధి దిశగా పాడి ప‌రిశ్ర‌మ‌: చీఫ్ విప్ వినయ్ భాస్కర్
  • పాల ఉత్పత్తులకు మార్కెటింగ్ బాధ్య‌త‌
  • కార్యాల‌యం కోసం రూ.5లక్షల నిధుల కేటాయింపు

విధాత, వరంగల్: రాష్ట్రంలో వ్యవసాయం, పాడి పరిశ్రమను అద్భుతంగా తీర్చిదిద్దామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ విజయ డెయిరీలో శుక్రవారం జరిగిన పాడి రైతుల అవగాహన సదస్సు ఉద్దేశించి ఆయ‌న‌ ప్రసంగించారు.

రాష్ట్రం ఏర్పడ‌క‌ ముందు నిర్వహించే డెయిరీలు నష్టాల్లో నడిచాయని… రాష్ట్రం ఏర్పడ్డాక పాడి పరిశ్రమ అభివృద్ధి జరిగిందని అన్నారు. పల్లెల్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు పాడి ద్వారా ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారన్నారు.

విజయ డెయిరీని మరో ముల్కనూర్, కరీంనగర్ డెయిరీల వలె మంచి లాభల్లోకి తీసుకువచ్చే బాధ్యతను తీసుకోవడమే కాకుండా… డెయిరీ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసే బాధ్యతను కూడా తీసుకుంటానని ఆయన అన్నారు.

పాల సామర్ధ్యాన్ని పెంచేందుకు డెయిరీ అధికారులు, యంత్రాంగం కృషి చేయాలని ఆయన అన్నారు. ఎన్నికలు నిర్వహించి నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో గొప్పగా ముందుకు నడపాలని కోరారు. నూతన పాలకవర్గం ఆఫీస్ కోసం సి.డి.ఎఫ్ నిధుల నుండి 5 లక్షలను కేటాయిస్తానని హామీనిచ్చారు.

పాడి పరిశ్రమ కోసం డి.సి.సి బ్యాంక్ నుండి రైతులకు ఋణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, డి.సి.సి బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కల్పలత సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జగన్ మోహన్ రావు, కార్పొరేటర్లు విజయలక్ష్మి-సురేందర్, ఇండ్ల నాగేశ్వరరావు, డి.డి ప్రదీప్, డెయిరి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.