Danakishore | అప్రమత్తంగా ఉండండి ,వర్షాల నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అధికారులను ఆదేశించిన దానకిషోర్
గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ ఎంసీ అధికారులను పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండండి
నగరంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోండి
నగర పౌరులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దు
వర్షాల నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అధికారులను ఆదేశించిన దానకిషోర్
విధాత: గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ ఎంసీ అధికారులను పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ఆదేశించారు. సోమవారం ఆయన జీహెచ్ఎంసీ, ఎన్‌ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. వర్షాలకు రోడ్లపై నీళ్లు నిలిచి ట్రఫిక్ జాం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అలాంటప్పడు అధికారులందరూ ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే అధికారులందరూ ఎ ప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆదేశించారు.