ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త, అత్తపై దాడి.. కీలకంగా మారిన సీసీ టీవీ ఫుటేజీ
ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఏకంగా భర్త, అత్తపైనే ఓ మహిళ దాడి చేయించిన ఘటన బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

విధాత, హైదరాబాద్ : ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఏకంగా భర్త, అత్తపైనే ఓ మహిళ దాడి చేయించిన ఘటన బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్తను చంపేస్తే ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయని భావించి తన తరుఫు బంధువులను పురమాయించి భర్త, అత్తలపై దాడి చేయించింది. కట్టేల మండి సమీపంలో భర్త, అత్తపై బంధువులతో భార్య దాడి చేయించింది. అత్తను చంపేస్తే ఆమె ఇన్సూరెన్స్ సొమ్ములు వస్తాయని కోడలు ప్లాన్ చేసింది.
కాగా.. అమె ఏర్పాటు చేసిన దుండగులు ఇంట్లోకి చొరబడి విచక్షణా రహితంగా దాడి చేశారు. డయల్ 100కు ఫోన్ చేసినా స్పందించలేదని బాధితులు చెబుతున్నారు. స్థానికులు చూస్తుండగానే.. కత్తులు, కర్రలతో నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్‌లో దాడి ఘటన రికార్డ్ అయ్యింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.