గులాబీ గూటికి మెదక్ డీసీసీ మాజీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి? ఇంటికి వెళ్లి మంత్రి హరీష్ రావు చర్చలు

గులాబీ గూటికి మెదక్ డీసీసీ మాజీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి? ఇంటికి వెళ్లి మంత్రి హరీష్ రావు చర్చలు

విధాత:మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా మాజీ డిసీసీ అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతిరెడ్డి ఆయన అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి షాక్ తగులనుంది. గురువారం సాయంత్రం మెదక్ బహిరంగ సభ అనంతరం మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు నవీన్ రావు, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి తదితరులు హైదరాబాద్ లోని నందినగర్‌లోని తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో నేరుగా మంత్రి హరీష్ రావు చర్చలు జరిపారు.


మెదక్ నియోజకవర్గ టికెట్ ఆశించిన తిరుపతి రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ రావులు బీఆర్ఎస్ పార్టీనీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ కాంగ్రెస్ టికెట్ రోహిత్ రావుకు కన్ఫామ్ కావడంతో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, డీసీసీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి 2 రోజుల క్రితం రాజీనామా చేశారు.



దీంతో తిరుపతి రెడ్డి అనుచరులు సహితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వారంతా తిరుపతి రెడ్డి వెంట ఉంటారా ? లేదా వేచి చూడాలి. మొత్తానికి మంత్రి హరీష్ రావు తిరుపతి రెడ్డినీ బిఆర్ఎస్ పార్టీలో చేరిపించేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీ పదవి గానీ, కార్పొరేషన్ చైర్మన్ పదవి గానీ తిరుపతి రెడ్డికి దక్కనునట్లు తెలుస్తోంది.