నేడు ఐటీ పై అసెంబ్లీలో చర్చ..!
విధాత: రాష్ట్రంలోని పరిశ్రమలు, ఐటీ రంగాల పురోగతిపై శాసనసభలో నేడు సోమవారం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్వల్పకాలిక చర్చ జరగనుంది. శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశ నిర్ణయాలను సభ్యులకు అందజేయనున్నారు. ఆదిలాబాద్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో పలు కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు, భూపాలపల్లిలోని పలు మండలాల పేర్లను సరిచేసే ముసాయిదాను సభ్యుల ముందుంచుతారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు, కొండా లక్ష్మణ్ ఉద్యానవన వర్సిటీ సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లు, నేషనల్ […]

విధాత: రాష్ట్రంలోని పరిశ్రమలు, ఐటీ రంగాల పురోగతిపై శాసనసభలో నేడు సోమవారం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్వల్పకాలిక చర్చ జరగనుంది. శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశ నిర్ణయాలను సభ్యులకు అందజేయనున్నారు. ఆదిలాబాద్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో పలు కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు, భూపాలపల్లిలోని పలు మండలాల పేర్లను సరిచేసే ముసాయిదాను సభ్యుల ముందుంచుతారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు, కొండా లక్ష్మణ్ ఉద్యానవన వర్సిటీ సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లు, నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ వర్సిటీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు.