నల్లొండ బీఆరెస్ కు మరో దెబ్బ..కాంగ్రెస్ గూటికి దుబ్బా రూప

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు దుబ్బా రూప అశోక్ సుందర్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆమెతో పాటు భర్త, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ దుబ్బా అశోక్ సుందర్ బుధవారం హైదరబాద్ లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
గతంలో వీరు కాంగ్రెస్ నుంచి బీఆరెస్ లో చేరారు. గులాబీ విధానాలు నచ్చక, తాజాగా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. వారికి హస్తం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దుబ్బా దంపతుల చేరికతో బీఆరెస్ కు నల్గొండలో మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ను అత్యధిక మెజార్టీతో గెలిచేందుకు పార్టీ శ్రేణులంతా పనిచేయాలని కోరారు.
ఆరు గ్యారెంటీ స్కీములపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.