పెద్దగట్టు జాతర: మౌలిక వసతుల కల్పనకు కృషి: మంత్రి జగదీష్‌రెడ్డి
గోడ పత్రిక ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి కృతజ్ఞతలు తెలిపిన ఆలయ చైర్మన్ విధాత: ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు అన్ని సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో పెద్దగట్టు పాలకవర్గంతో కలిసి జాతర గోడపత్రికను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. రాష్ట్రంలోనే రెండవ […]

- గోడ పత్రిక ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి
- కృతజ్ఞతలు తెలిపిన ఆలయ చైర్మన్
విధాత: ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు అన్ని సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
గురువారం సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో పెద్దగట్టు పాలకవర్గంతో కలిసి జాతర గోడపత్రికను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. రాష్ట్రంలోనే రెండవ అతి పెద్ద జాతరగా పేరుగాంచిన లింగమంతుల స్వామి జాతరకు ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో నిధులు కేటాయించినట్లు తెలిపారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ సంవత్సరం పెద్దగట్టు జాతరకు 10 కోట్ల మేర అభివృద్ధి నిధులను కేటాయించారని త్వరలోనే పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో చైర్మన్ కోడి సైదులు యాదవ్, డైరెక్టర్లు కాస శీను, జటంగి వెంకటేశ్వర్లు, మట్టపల్లి శ్రీనివాస్ యాదవ్, చింతకాయల జానయ్య యాదవ్, మొండి కత్తి దుర్గమ్మ, మెంతేబోయిన వెంకన్న, ఈవో కుశలయ్య, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, ప్రముఖ పాత్రికేయులు వీరయ్య యాదవ్, మట్ట రాజు తదితరులు పాల్గొన్నారు
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్
పెద్దగట్టు అభివృద్ధికి పది కోట్లు కేటాయించినందుకు మంత్రి జగదీష్ రెడ్డికి పెద్దగట్టు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కోడి సైదులు యాదవ్ మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఆయన వెంట స్పెషల్ పీపీ నలమాల గోపాల కృష్ణ యాదవ్ ఉన్నారు