నేటితో ఎన్నికల ప్రచారానికి తెర
ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడనుంది.సాయంత్రం 5 గంటలకు మైకుల మోతకు బ్రేక్. పోలింగ్ కు ముందు రెండు రోజులు కీలకం కావడంతో పోల్ మేనేజ్మెంట్ పై అన్ని పార్టీల నేతలు నజర్ పెట్టారు

విధాత: ఎన్నికల ప్రచార సమరానికి మంగళవారంతో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు మైకుల మోతకు బ్రేక్ పడనుంది. పోలింగ్ కు ముందు రెండు రోజులు కీలకం కావడంతో పోల్ మేనేజ్మెంట్ పై అన్ని పార్టీల నేతలు నజర్ పెట్టారు. ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. పోలీసు ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు.