Election Commission Shock to KTR | కేటీఆర్‌కు ఈసీ షాక్..
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ రోజున కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా మీడియాతో

చర్యలకు ఆదేశం
విధాత, హైదరాబాద్: బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ రోజున కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా మీడియాతో మాట్లాడుతూ ఓ వ్యక్తికి ఓటేశానని పరోక్షంగా చెప్పాడని, ఇది ఎన్నికల ఉల్లంఘన అవుతుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలిచ్చింది. ఏఐసీసీ సభ్యులు నిరంజన్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ వివాదంపై కేటీఆర్‌కు వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. వివరణ ఇచ్చేందుకు నిర్ధేశించిన గడువు కూడా ముగిసింది.