Medak| పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా

జిల్లాలోని ఉద్యోగులందరూ విధిగా పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు

Medak| పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: జిల్లాలోని ఉద్యోగులందరూ విధిగా పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో భవన్లో సంఘం ఆధ్వర్యంలో కర్మచారి కళ్యాణ్ మిషన్ పేరుతో నిర్వహించిన ఉద్యోగుల ఓటు హక్కు అవగాహన సంక్షేమ సదస్సుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఫార్మ్ 12 అప్లై చేసి పోస్టల్ బ్యాలెట్లు రానివారు తమ దృష్టికి తీసుకురావాలని, ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ఎన్నికల్లో విధులు నిర్వర్తించే చోటనే, ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు.


సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులు క్రమం తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, వంద శాతం ఉద్యోగులు ఓటింగ్ లో పాల్గొనాలని, తద్వారా సమాజంలో మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం దక్కుతుందన్నారు. టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఏదైనా ఇబ్బంది తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని, తద్వారా జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొని సమస్యలు పరిష్కరిస్తామన్నారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మినికి రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గాండ్ల అనురాధ, జిల్లా ఉపాధ్యక్షులు మంగ మనోహర్, ఫణి రాజ్, ఎండీ ఇక్బాల్ పాషా, ఫజలుద్దీన్, సంయుక్త కార్యదర్శులు పోతురాజు శంకర్, రాధా, కార్యాలయ కార్యదర్శి కోటి రఘునాథరావు, కార్యనిర్వాహక కార్యదర్శి చిరంజీవచార్యులు, ప్రచార కార్యదర్శి నర్సింలు, కార్యవర్గ సభ్యులు లీల, విష్ణువర్ధన్ రెడ్డి, కిరణ్ కుమార్, మెదక్ యూనిట్ అధ్యక్ష,కార్యదర్శులు పంపరి శివాజీ, ఆరేళ్ల రామా గౌడ్, నర్సాపూర్ యూనిట్ అధ్యక్ష,కార్యదర్శులు శేషాచారి, రాకేష్, ఏడుపాయల వనదుర్గ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు సూర్య శ్రీనివాస్, ప్రశాంత్, రామాయంపేట యూనిట్ అధ్యక్ష,కార్యదర్శులు అనుముల ప్రభాకర్, నిఖిల్ శ్రీనివాస్, చేగుంట యూనిట్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, తూప్రాన్ యూనిట్ అధ్యక్షులు శంకర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు జంగం నగేష్, హాస్టల్ వెల్ఫేర్ ఫోరమ్ కార్యదర్శి శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాల్, సలావుద్దీన్, ఉద్యోగులు పాల్గొన్నారు.