ఆ మాటలు కేసీఆర్ కు నచ్చలేదు: ఎమ్మెల్యే ఈటల రాజేందర్
తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ, ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించరని మంత్రిగా ఉన్న నాడే తాను కేసీఆర్ కు చెప్పానని, ఆ మాటలు ఆయనకు నచ్చలేదని ఈటల అన్నారు.

- ప్రభుత్వ నిర్ణయాలపై నేరుగానే ప్రశ్నించా
- ఏకుమేకవుతాననే బయటకు పంపారు
విధాత బ్యూరో, కరీంనగర్: తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ, ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించరని మంత్రిగా ఉన్న నాడే తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పానని, ఆ మాటలు ఆయనకు నచ్చలేదని బీజేపీ సీనియర్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో సోమవారం నిర్వహించిన జన గర్జన సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. 2015లో మున్సిపల్ కార్మికులు వేతనాల కోసం సమ్మె చేస్తే, ముఖ్యమంత్రి 1700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని గుర్తు చేశారు. వాళ్లు నోరులేని కార్మికులు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని ప్రశ్నించిన వ్యక్తిత్వం తనదన్నారు.
ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉద్యమ గళాలు వినిపిస్తే, అక్కడ వారితో గొంతు కలిపింది తానే అన్నారు. ఏ ఉద్యమాల ద్వారా తెలంగాణ సమాజంలో చైతన్యం వచ్చిందో, దానికి వేదికగా నిలిచిన ఇందిరా పార్క్ లో సభలు, సమావేశాలు, ఆందోళనలు నిర్వహించడాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని తప్పు పట్టానన్నారు. ఆర్టీసీ కార్మికులకు ధైర్యం ఇచ్చినా, వీఆర్ఏలకు మద్దతు పలికినా అవేవీ కేసీఆర్ కు నచ్చలేదన్నారు. ప్రజల కోసం పనిచేయడంలో మంత్రి పదవి పెద్దది కాదని భావించే, ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వచ్చానన్నారు. దీంతో తాను ఏకు మేకు అవుతున్నానని భావించి, కేసీఆర్ తనను బలి పశువు చేశారన్నారు. 2007లో తెలంగాణకు అనుకూలంగా బీజేపీ తీర్మానం చేసిందని, 2014లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం బీజేపీ ఘనతేనని చెప్పారు.
ఆ సమయంలో రాజ్ నాథ్ సింగ్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి చిన్న రాష్ట్రాల ఏర్పాటు సరైనదని జనసంఘ్ ఎప్పుడో తీర్మానం చేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటులో రాజ్ నాథ్ సింగ్, సుష్మ స్వరాజ్ పాత్ర కీలకం అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో, కమలాపూర్ ఓటర్లు ఏ రాజకీయ నేపథ్యంలేని తనను 25 వేల ఓట్లతో గెలిపించారని చెప్పారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం అన్నం తన ప్రోద్బలంతోనే ప్రారంభం అయింది అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రభుత్వ ఆసుపత్రులలో వసతుల మెరుగుదలకు విశేష కృషి చేశానన్నారు. ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ ఎన్నో కుట్రలు చేశారని, అయినా ప్రజల గుండెల్లో స్థానం ఉన్న తనను ఓడించలేకపోయారని తెలిపారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసినా, తన గెలుపును అడ్డుకోలేకపోయారని చెప్పారు. తాను వైద్యుడిని కాకున్నా, మందులు ఇచ్చే స్థాయిలో లేకున్నా, ధైర్యాన్ని ఇచ్చే స్థాయిలో ఉన్నానని, అన్నట్లుగానే గాంధీ ఆసుపత్రికి వెళ్లి మొట్టమొదటి కరోనా పేషంట్ భుజం తట్టి, ధైర్యం ఇచ్చి వచ్చానని