రెవెన్యూ డివిజన్‌గా ఏటూరునాగారం

రెవెన్యూ డివిజన్‌గా ఏటూరునాగారం
  • ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

విధాత, వరంగల్: ములుగు జిల్లాలో ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ శనివారం ప్రభుత్వం జీవో జారీచేసింది. గత కొంతకాలంగా ఏటూరునాగారాన్ని డివిజన్ కేంద్రంగా చేయాలని స్థానికంగా డిమాండ్ కొనసాగుతోంది.

ఇటీవల మంత్రి హరీష్ రావు ములుగు పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. తాజాగా ఉత్తర్వులు జారీ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు