నిండిన సింగూరు ప్రాజెక్టు

- పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీ లు
- ప్రస్తుత నీటి సామర్థ్యం 29.589 టీఎంసీ లు
- 11వ నెంబర్ గేట్ ఎత్తి దిగువకు నీరు విడుదల
విధాత, మెదక్ బ్యూరో: సింగూరు ప్రాజెక్టు నిండింది. సరాసరి పూర్తి స్థాయి నీటి మట్టం పెరుగుతుండడంతో అధికారులు ప్రాజెక్టు 11 వ నెంబర్ గేట్ తెరచి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 29.589 టీఎంసీ లకు చేరుకుంది.
నిండిన సింగూరు ప్రాజెక్టుకాగా ఇన్ ఫ్లో 3528 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 9654 క్యూసెక్కులు ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల డంతో మంజీర నది పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.