సెల్ టవర్‌కు ఊరేసుకుని ఆత్మహత్య: కుటుంబానికి పలువురి పరామర్శ.. ఆర్థిక సాయం
రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ విధాత, నిజామాబాద్: లింగంపేట మండలం మెంగారం గ్రామంలో చెరువు నీటితో తన పొలంలో పంట నాశనం అవుతుందని గ్రామానికి చెందిన పుట్ట ఆంజనేయులు మనస్థాపానికి గురై సెల్ టవర్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సదరు రైతు తన సమస్యను ఎన్ని సార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన చెందాడు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు, పోలీసులు, గ్రామస్థుల సమక్షంలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. […]

- రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
విధాత, నిజామాబాద్: లింగంపేట మండలం మెంగారం గ్రామంలో చెరువు నీటితో తన పొలంలో పంట నాశనం అవుతుందని గ్రామానికి చెందిన పుట్ట ఆంజనేయులు మనస్థాపానికి గురై సెల్ టవర్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సదరు రైతు తన సమస్యను ఎన్ని సార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన చెందాడు.
సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు, పోలీసులు, గ్రామస్థుల సమక్షంలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రైతు పుట్ట ఆంజనేయులు కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు మంగళవారం పరామర్శించి ఆర్థిక సహాయన్ని అందించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం నుంచి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా, మూడు ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పరామర్శించిన వారిలో మండలం ప్రెసిడెంట్ షరీఫ్, తూర్పు రాజులు, లింగ గౌడ్, ఆనంద్, మేరాజ్, రాజు, అర్షద్, లక్ష్మణ్, పరమేష్, సర్దార్ నాయక్, ప్రకాష్, సాయిబాబా, కామారెడ్డి జిల్ల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొహమ్మద్ సాజీద్ ఇతర ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.