మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణారెడ్డికి జ‌రిమానా

విధాత‌(హైద‌రాబాద్): క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌తి ఒక్క‌రూ డ‌బుల్ మాస్కు ధ‌రించాల‌ని అటు వైద్య నిపుణులు, ఇటు ప్ర‌భుత్వాలు కోడై కూస్తున్న కొంత‌మందికి అస‌లు చెవిన ప‌ట్ట‌డం లేదు. కారులో వెళ్లినా కూడా మాస్కు ధ‌రించాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులిచ్చింది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌రూర్‌న‌గ‌ర్ పోలీసులు క‌ర్మ‌న్‌ఘాట్ చౌర‌స్తా వ‌ద్ద మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వాహ‌నాల‌ను త‌నిఖీ చేశారు. వాహనాల్లో వెళ్తూ మాస్కు ధ‌రించ‌ని వారికి పోలీసులు జ‌రిమానా విధించారు. ఇదే స‌మ‌యంలో మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణా […]

మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణారెడ్డికి జ‌రిమానా

విధాత‌(హైద‌రాబాద్): క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌తి ఒక్క‌రూ డ‌బుల్ మాస్కు ధ‌రించాల‌ని అటు వైద్య నిపుణులు, ఇటు ప్ర‌భుత్వాలు కోడై కూస్తున్న కొంత‌మందికి అస‌లు చెవిన ప‌ట్ట‌డం లేదు. కారులో వెళ్లినా కూడా మాస్కు ధ‌రించాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులిచ్చింది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

స‌రూర్‌న‌గ‌ర్ పోలీసులు క‌ర్మ‌న్‌ఘాట్ చౌర‌స్తా వ‌ద్ద మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వాహ‌నాల‌ను త‌నిఖీ చేశారు. వాహనాల్లో వెళ్తూ మాస్కు ధ‌రించ‌ని వారికి పోలీసులు జ‌రిమానా విధించారు. ఇదే స‌మ‌యంలో మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణా రెడ్డి త‌న కారులో వెళ్తుండ‌గా పోలీసులు ఆపారు. మాస్కు ధ‌రించ‌ని తీగ‌ల కృష్ణారెడ్డికి స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ముఖేష్ రూ. 1000 జరిమానా విధించారు. దీంతో తీగ‌ల కృష్ణారెడ్డి, ముఖేష్‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కారులో వెళ్లినా కూడా మాస్కు ధ‌రించాల్సిందేన‌ని తీగ‌ల‌కు ఎస్ఐ తేల్చిచెప్పారు.