ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం

హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాలతో తెలంగాణలో పెరిగిన పచ్చదనం, పరిశుభ్రత కరీంనగర్ జిల్లాలో 34 లక్షల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు హరితవనంగా కరీంనగర్ స్థానిక సంస్థలకు నేరుగా ప్రభుత్వ నిధులు ప్రతీ పల్లెకు అందుబాటులో నర్సరీలు, ట్రాక్టర్లు, మెరుగైన సౌకర్యాలు మారిన ప్రజల జీవన విదానం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలి విధాత‌:కరీంనగర్ జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్తెలంగాణ ప్రాంతంలో పల్లెలు, పట్టణాల్లోని ప్రజలందరూ ఆరోగ్యంగా […]

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం
  • హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాలతో తెలంగాణలో పెరిగిన పచ్చదనం, పరిశుభ్రత
  • కరీంనగర్ జిల్లాలో 34 లక్షల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు
  • హరితవనంగా కరీంనగర్
  • స్థానిక సంస్థలకు నేరుగా ప్రభుత్వ నిధులు
  • ప్రతీ పల్లెకు అందుబాటులో నర్సరీలు, ట్రాక్టర్లు, మెరుగైన సౌకర్యాలు
  • మారిన ప్రజల జీవన విదానం
  • ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలి

విధాత‌:కరీంనగర్ జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ ప్రాంతంలో పల్లెలు, పట్టణాల్లోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, పచ్చగా ఉండాలని, అనారోగ్యం లేకుండా పల్లెలు అభివృద్ధి చెంది పట్టణాలుగా ఎదగాలి, పట్టణాలు ఆధునీకరణ కావలనే గొప్ప సంకల్పం తీసుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. నాలుగో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కరీంనగర్ పట్టణం 18వ డివిజన్ రేకుర్తిలో ప్రారంభించారు గంగుల. అనంతరం మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాకపూర్వం పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేక, పల్లెలు, పట్టణాలకు నిధులు ఇవ్వక అస్తవ్యస్తంగా చేశారని తద్వారా రోగాల వ్యాప్తితో పాటు అభివృద్ది లేమి కనిపించేదన్నారు. ఆ పరిస్థితులను రూపుమాపాలని, తెలంగాణ ఆరోగ్య తెలంగాణగా మార్చాలనే తాపత్రయంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరిత హారం లాంటి కార్యక్రమాలతో పాటు పట్టణ ప్రగతిని రూపొందించారన్నారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ వనాలకు వేదికగా ఉండేదని, కాంక్రీట్ తో నిండిన కొత్త జిల్లాలోనూ వనాలు పెరిగి హరితంగా మార్చే దిశగా ఈ ఏడో విడత హరితహారం ద్వారా క్రుషిచేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ నాటిన మెక్కల్లో తొంబై శాతం కాపాడుకున్నామని, ఈ ప్రగతిలో భాగస్వాములైన అందరినీ అభినందించారు మంత్రి గంగుల. కేసీఆర్ గారి సారథ్యంలో యాబై ఏళ్ల అబివృద్దిని కేవలం ఏడేళ్లలో చేసి చూపించామన్నారు. ప్రస్థుతం మున్సిపాలిటీ, స్థానిక సంస్థల నిధులకు తోడు ప్రభుత్వమే నేరుగా నిధుల్ని కేటాయిస్తున్నందున అత్యద్భుతంగా గ్రామాలు, పట్టణాలు డెవలప్ అయ్యాయన్నారు. ప్రతీ గ్రామానికి నర్సరీలతో పాటు, శానిటేషన్ కార్యక్రమాలకోసం ట్రాక్టర్లను సైతం అందజేశామన్నారు మంత్రి. ప్రజలు సైతం ఇది మన నగరం, మన పల్లే అనే స్రుహతో పర్యావరణ పరిరక్షణకు, పరిశుబ్రంగా ఉండడానికి సహకరించాలన్నారు. ప్రతీ ఒక్కరూ మెక్కల్ని పెంచి అభివృద్ధి చేసి, పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సంకల్పం తీసుకోవాలన్నారు. హరిత హారంలో బాగంగా ఈ సంవత్సరం 34 లక్షల మొక్కలు నాటుతామన్నారు మంత్రి. పట్టణాల్లో నాటే పది లక్షల మొక్కల్లో కరీంనగర్ కార్పోరేషన్లో ఐదు లక్షలు, మిగతా మున్సిపాలిటీల్లో ఐదు లక్షలు, ఇరవైనాలుగు లక్షలు మొక్కలు పల్లెల్లో ఈ సంవత్సరం నాటుతామన్నారు. మన తదనంతరం నిలిచి ఉండే చెట్లు భావితరాలకు విలువైన ఆస్థులుగా మిగులుతాయన్నారు. ప్రతీ ఇంటినుండి ఆరుగురు మెక్కలు నాటాలని, నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. భావితరాలకు ఆరోగ్యకరమైన బంగారు భవిష్యత్తుని అందించే ఈ మహాయజ్ణంలో అందరూ పాల్గొనాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.
పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ శశాంక, కార్పోరేషన్ కమిషనర్ వల్లూరి క్రాంతి, మేయర్, డిప్యూటీ మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.