రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబురాలు
రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు సంబరంగా నిర్వహించారు. శనివారం నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సందడి చేశారు

- రామమందిర ప్రారంభ వేళ ఈ సంక్రాంతి ప్రత్యేకమన్న గవర్నర్
విధాత : రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు సంబరంగా నిర్వహించారు. శనివారం నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సందడి చేశారు. స్వయంగా సంక్రాంతి ప్రత్యేక పాయసం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు. చిరకాల స్వప్నం రామమందిరం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించుకుంటున్న వేళ వచ్చిన ఈ సంక్రాంతి పండుగ తనకు వ్యక్తిగతంగా ప్రత్యేకమైందన్నారు. శ్రీరాముడికి హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. ఇది వికసిత భారత్ అని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై శుక్రవారం పుదుచ్చేరి రాజ్ భవన్‌లో కూడా పొంగల్ వేడుకల్ని నిర్వహించారు. అనంతరం ఆమె ఢిల్లీలో జరిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెలుతున్నట్లుగా తెలిపారు. తన ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటన కాదని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.