బీఆరెస్‌కు మరో షాక్.. ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢిలా పడిన బీఆరెస్ పార్టీకి హైకోర్టు మరో షాక్ నిచ్చింది. ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన బీఆరెస్‌ ఎమ్మెల్సీ దండె విఠల్

బీఆరెస్‌కు మరో షాక్.. ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు

విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢిలా పడిన బీఆరెస్ పార్టీకి హైకోర్టు మరో షాక్ నిచ్చింది. ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన బీఆరెస్‌ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుతో మండలిలో బీఆరెస్ మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోనుంది. దండె విఠల్ తన పేరిట ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని, ఆయన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. తాజాగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చి, రూ.50వేల జరిమానా విధించింది.