పార్లమెంటుకు పోటీ చేస్తా కె.జానారెడ్డి.. ఎల్బీనగర్‌లో పోటీ చేస్తా: రాజగోపాల్‌రెడ్డి

విధాత: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయన ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయబోనని, పార్లమెంటుకు పోటీ చేస్తానని తన మనసులోని మాటను ఖర్గేకు వివరించారు.
తనకు బదులుగాఅసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారులు జయవీర్‌రెడ్డికి నాగార్జున సాగర్‌లో, రఘువీర్‌రెడ్డికి మిర్యాలగూడలో కాంగ్రెస్ టికెట్లు కేటాయించాలని అభ్యర్ధించారు. ఇందుకు ఖర్గే పార్టీ కమిటీలలో చర్చించి నిర్ణయం చెబుతానని జానాకు హామీ ఇచ్చారని పార్టీ వర్గాల కథనం.
ఎల్బీనగర్‌లో పోటీ చేస్తా: రాజగోపాల్‌రెడ్డి
విధాత : తాను బీజేపీలోనే కొనసాగుతానని, పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ పిదప విలేఖరులతో మాట్లాడారు.
తుది శ్వాస వరకు తాను బీజేపీలోనే కొనసాగుతానన్నారు. దేశం కోసం పనిచేేసే పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. నన్ను బద్నాం చేసేలా పార్టీ మారుతున్నట్లుగా తప్పుడు ప్రచారం చేయవద్దన్నారు. కేసీఆర్ అవినీతి పాలన అంతం చేయడం కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. పార్టీ అవకాశం ఇస్తే తాను బీజేపీ నుంచి ఎల్భీ నగర్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు