సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు గడువులోగా పూర్తి : క్రిస్టియానా జెడ్ చొంగ్తో
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చొంగ్తో అధికారులను ఆదేశించారు

పనుల ప్రగతి పై ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చొంగ్తో
విధాత, వరంగల్ ప్రతినిధి: సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చొంగ్తో అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి చొంగ్తో ఆ శాఖ కమిషనర్, టిఎస్ఎంఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ వి. కర్ణన్, జాయింట్ కమీషనర్ వినయ్ కృష్ణారెడ్డి, కలెక్టర్ పి. ప్రావీణ్య లతో కలసి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల ప్రగతిని అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా నగరంలోని ఎం జి ఎం, ప్రభుత్వ కంటి ఆసుపత్రి, ప్రభుత్వ సికే ఎం ప్రసూతి ఆసుపత్రి, హన్మకొండ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ టిబి ఆసుపత్రులలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న విభాగాలు, ఉపస్థితిలో ఉన్న ఈక్విప్మెంట్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి మార్పు చేసే విభాగాలు తదితర అంశాలను ఆయా ఆసుపత్రుల పర్యవేక్షకులతో వారు కూలంకషంగా చర్చించారు.
ఈ సందర్భంగా కార్యదర్శి చొంగ్తో అధికారులతో కలిసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు. అనంతరం వారు ఎం జి ఎం ఆసుపత్రి లోని క్యాజువాలిటీ, పిడియాట్రిక్ విభాగాలను, కె ఎం సి లోని పి ఎం ఎస్ ఎస్ వై ఆసుపత్రి క్యాథ్ ల్యాబ్, డయాలిసిస్ విభాగాలను సందర్శించి ఎక్విప్మెంట్, అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ నాగేంద్ర, ఈఈ జితేందర్ రెడ్డి టిఎస్ఎంఐడిసి ఎస్ ఈ దేవేందర్, ఎం జి ఎం, ప్రభుత్వ కంటి ఆసుపత్రి, ప్రభుత్వ సికే ఎం ప్రసూతి ఆసుపత్రి, హన్మకొండ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ టిబి ఆసుపత్రుల పర్యవేక్షకులు చంద్రశేఖర్, నిర్మల, విజయలక్ష్మి, శ్రవణ్, గిరిధర్, సికేఎం ప్రిన్సిపల్ మోహన్ దాస్, వైస్ ప్రిన్సిపల్ రాం కుమార్ రెడ్డి, ఎల్ అండ్ టి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.