ప్రపంచానికి భారత్ అందించిన వరం యోగా .. ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ

ప్రపంచానికి భారతదేశం అందించిన వరం యోగా అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరరాజనర్సింహ వ్యాఖ్యానించారు. జూన్ 21న ప్రపంచ యోగా డే కర్టెన్ రైజర్ పురస్కరించుకుని వైద్య, ఆరోగ్య శాఖ పీపుల్స్ ప్లాజా, నెక్లస్ రోడ్డులో విద్యార్థులతో యోగ డే వాక్ కార్యక్రమం నిర్వహించింది.

ప్రపంచానికి భారత్ అందించిన వరం యోగా .. ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ

విధాత, హైదరాబాద్ : ప్రపంచానికి భారతదేశం అందించిన వరం యోగా అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరరాజనర్సింహ వ్యాఖ్యానించారు. జూన్ 21న ప్రపంచ యోగా డే కర్టెన్ రైజర్ పురస్కరించుకుని వైద్య, ఆరోగ్య శాఖ పీపుల్స్ ప్లాజా, నెక్లస్ రోడ్డులో విద్యార్థులతో యోగ డే వాక్ కార్యక్రమం నిర్వహించింది. యోగా డే వాక్‌కు హాజరైన మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూపూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప చారిత్రక సంపద యోగ అని చెప్పారు. మన ఆరోగ్యాన్ని కాపోడుకోవాలని, దినచర్యను క్రమశిక్షణతో నడిపించుకోవాలని, వీటన్నింటికి దిక్సూచి యోగా మాత్రమేనని అన్నార యోగా సాధన వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు. ప్రతి స్కూల్లో, కాలేజీల్లో యోగాను దినచర్యగా నిర్వహించాలని, ఫ్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలో, కళాశాలలో ఘనంగా నిర్వహించాలని, యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు.