కేసీఆర్ ఛాతీలో ఇన్ఫెక్షన్.. కోలుకునేందుకు సమయం పడుతుంది: కేటీఆర్

ముఖ్యమంత్రి ఆరోగ్యంపై కేటీఆర్ వెల్లడి
విధాత: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఛాతీలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆయన కుమారుడు, మంత్రి కే తారకరామారావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఆయన శుక్రవారం స్పందిస్తూ.. ఈ విషయం వెల్లడించారు.
కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రికి వైరల్ ఫీవర్ వచ్చిందని, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కోలుకునేందుకు అనుకున్నదానికంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉన్నదని కేటీఆర్ తెలిపారు. వైరల్ ఫీవర్‌తో గత మూడు వారాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వైద్యులు ఆయనకు ఇంట్లోనే వైద్యం అందిస్తున్నారు. నిత్యం పర్యవేక్షిస్తున్నారు.