అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరికలు : MLA రవీంద్ర కుమార్

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి బీఆరెస్ లోకి వలసలు ఊపందుకుంటున్నాయని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు

అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరికలు : MLA రవీంద్ర కుమార్

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి బీఆరెస్ లోకి వలసలు ఊపందుకుంటున్నాయని దేవరకొండ శాసన సభ్యులు, ఆపార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలం ముడుదాండ్ల గ్రామానికి చెందిన 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, ఉపాధ్యక్షుడు యసాని రాజవర్ధన్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొందేటి మల్లా రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.