ఈ నెల 21న తెలంగాణ సమాఖ్య సంఘాల ఉమ్మడి మ్యానిఫెస్టోలు

విధాత : తెలంగాణలోని సబ్బండ వర్ణాలు కోరుకుంటున్న అంశాలపై తెలంగాణ సమాఖ్య సంఘాల ఉమ్మడి మ్యానిఫెస్టో, ప్రజాసంఘాల మ్యానిఫెస్టోలను శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేయనున్నట్టు ఆ సంఘం ఆర్గనైజింగ్ కన్వీనర్ కరుణాకర్ దేశాయి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వీటిపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణ సమాఖ్య ఉమ్మడి మ్యానిఫెస్టోల్లో 1.తెలంగాణ ప్రజల భూమి మ్యానిఫెస్టో, 2. ఆదివాసీల మ్యానిఫెస్టో, 3.నీటిపారుదల ప్రాజెక్టుల మ్యానిఫెస్టో, 4. వైద్యం మ్యానిఫెస్టో, 5. విద్యా మ్యానిఫెస్టోలతోపాటు.. తెలంగాణ ప్రజా సంఘాలకు సంబంధించి తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్స్ యూనియన్స్ జాక్, తెలంగాణ కళాకారుల సంరక్షణ సమితి, తెలంగాణ ఆజాద్ ఫోర్స్ (TAF ఆన్‌లైన్ & ఆన్‌రోడ్ ఉద్యమకారులు), తెలంగాణ గల్ఫ్ – జాక్, తెలంగాణ పరిరక్షణ సమితి, కోతుల బెడద బాధితుల సంఘం, ఎకనామికల్లీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (EBC), తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF), తెలంగాణ మట్టి మనుషుల వేదిక, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం, వోట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్, ఫోరం అగెనిస్ట్ కరెప్షన్ & టెర్రరిజం (FACT ), తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక, తెలంగాణ వీధి వ్యాపారుల అసోసియేషన్, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ అడ్వకేట్స్- జాక్, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక, తెలంగాణ సామాజిక కార్యకర్తల వేదిక, నిర్మాణ్ ఫౌండేషన్, తెలంగాణ ఉద్యమ సమితి, ఇండియన్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ మేధావుల ఫోరం, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం (TSMF), హైదరాబాద్ జిందాబాద్, తెలంగాణ కేబుల్ చానల్స్ రిపోర్టర్స్ అసోసియేషన్ (TCCRA)ల మ్యానిఫెస్టోలు ఉంటాయని తెలిపారు. ప్రజస్వామిక తెలంగాణా సాకారానికి చేసే ఈ ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు.